ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న గేం చేంజర్ సినిమా వస్తుంది. ఈ సినిమాను శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. గేం చేంజర్ తో ఎలాగు పాన్ ఇండియా వైడ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న చరణ్ బుచ్చి బాబు సినిమాతో మరో నెక్స్ట్ లెవెల్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా లో హీరోయిన్ గా మరో బాలీవుడ్ భామని దించుతున్నారని తెలుస్తుంది. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ ప్రకారం బుచ్చి బాబు చరణ్ కాంబోలో దీపికా పదుకొనెని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ ప్రభాస్ తో కల్కి సినిమాలో దీపిక నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాకు దీపికా సైన్ చేయనుందని తెలుస్తుంది.

చరణ్ తో దీపికా అంతకుముందే డిస్కషన్స్ లో ఉన్నా అది కుదరలేదు. ప్రియాంక చోప్రాతో జంజీర్ చేసే టైం లోనే దీపికా ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు. మళ్లీ ఇన్నేళ్లకు దీపికతో చరణ్ రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కల్కితో సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు వస్తున్న దీపికా చరణ్ సినిమాతో కూడా అలరిస్తుందని చెప్పొచ్చు. సౌత్ సినిమాల్లో కూడా తన ముద్ర వేయాలని చూస్తున్న దీపికా పదుకొనె కల్కితో పాటు ఇక మీదట ఇక్కడ ఆఫర్లను కూడా ఓకే చేయాలని అనుకుంటుంది. తప్పకుండా దీపికాకు తెలుగులో కూడా స్టార్ రేంజ్ దక్కించుకుంటుందని చెప్పొచ్చు. కల్కితో పాటు మరికొన్ని సినిమాలు కూడా దీపిక ఖాతాలో రావాలని చూస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: