సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన సెంటిమెంట్స్ ఉంటాయి. వందల కోట్ల పెట్టుబడితో సినిమాలు తీస్తారు కాబట్టి ఆసినిమాలను తీసే దర్శక నిర్మాతలకు విపరీతమైన సెంటిమెంట్లు వెంటాడుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలమంది వరలక్ష్మి శరత్ కుమార్ సంబంధించిన సెంటిమెంట్లు గురించి మాట్లాడుకుంటున్నారు.వాస్తవానికి ఇప్పుడు ఆమెకు తమిళంలో కంటే తెలుగులోనే ఆమెకు అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. నెగిటివ్ పాత్రలను అదేవిధంగా పాజిటివ్ పాత్రలను చేసే విషయంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తమిళనాడులో పుట్టి పెరిగినప్పటికీ ఆమె తెలుగులో చాల అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉండటంతో ఆమె నటించే సమయంలో వ్యక్తపరిచే హావభావాలకు పలికే డైలాగ్స్ కు సరిగ్గా సరిపోతోంది.ఈమె క్రేజ్ ప్రస్తుతం బాగా పెరగడంతో ఆమెకు పారితోషికం కూడ చాల భారీ స్థాయిలో ఇస్తున్నారు. ఈపరిస్థితుల మధ్య ఈమెకు సంబంధించిన ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. వరలక్ష్మి నటించిన సినిమాలో ఆమె పాత్ర చనిపోతే ఆసినిమా బ్లాక్ బష్టర్ హిట్ అవుతుంది అంటూ ఒక కొత్త సెంటిమెంట్ తెర పైకి తీసుకు వస్తున్నారు.లేటెస్ట్ గా విడుదలైన ‘హనుమాన్’ మూవీలో తేజ్ సజ్జా కు అక్క పాత్రలో నటించిన ఆమె ఈసినిమాకు సంబంధించిన ప్రీ క్లైమాక్స్ కి ముందు విలన్ వినయ్ రాయ్ చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. గత ఏడాది విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ అయిన ‘వీరసింహారెడ్డి’ మూవీలో కూడ ఆమె పాత్ర మొదట్లో ఆమె నెగిటివ్ గా మొదలై ఆతరువాత పాజిటివ్ గా మారి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ ఇంటిముందు ఆత్మహత్యా చేసుకున్న పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అంతకు ముందు విడుదలైన రవితేజ ‘క్రాక్’ మూవీలో ఆమె నెగిటివ్ రోల్ లో నటిస్తూ మరొక విలన్ సముద్రఖని అనుచరుల చేతిలో హత్యకు గురవుతుంది. ఇలా ఆమె నటించిన సినిమాలలోని పాత్రలు చనిపోతే చాలు ఆసినిమా సూపర్ హిట్ అంటూ కొత్త సెంటిమెంట్ ను లేవనెత్తుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: