బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ప్రభాస్ తో చేసిన ‘ఆదిపురుష్’ ప్రయోగం వికటించడంతో ఇక ఇప్పట్లో ఎవరు రామాయణం జోలికి వెళ్లరు అంటూ చాలామంది అంచనాలు వేశారు. అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తాను తీయాలి అనుకున్న ‘రామాయణం’ స్క్రిప్ట్ ముందుకు నడుస్తూనే ఉంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు చాల వేగవంతంగా జరుగుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల మధ్య ఎవరు ఊహించని విధంగా చిన్న సినిమాగా విడుదల అయిన ‘హనుమాన్’ హిందీ డబ్బింగ్ కు బాలీవుడ్ ప్రేక్షకులలో మంచి స్పందన వస్తున్న నేపధ్యంలో దర్శకుడు నితీష్ కు బాలీవుడ్ లో ‘హనుమాన్’ కలక్షన్స్ విషయంలో చేస్తున్న హంగామ దర్శకుడు నితీష్ కు మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఉండటంతో ఈ మూవీ త్వరలో షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ టాప్ హీరో రణబీర్ కపూర్ రాముడుగా సీతా దేవిగా సాయి పల్లవి ల ఎంపిక ఇప్పటికే పూర్తి అయింది అంటున్నారు. వాస్తవానికి ఈ మూవీ దర్శకుడు రావణ పాత్ర కోసం ‘కేజీ ఎఫ్’ హీరో యష్ ను సంప్రదించినప్పటికీ అతడు ఇంకా తన ఫైనల్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ దర్శకుడు రావణ పాత్ర కోసం ఎవర్ని ఎంపిక చేయాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ మూవీలో కుంబకర్ణుడి పాత్రలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ తరాల పిల్లలు రామాయణ ఇతి హాసాన్ని తెలుసుకుంటారు అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీని భారీ బడ్జెట్ తో సుమారు 500 కోట్లు ఖర్చుపెట్టి తీయబోతున్నారని తెలుస్తోంది. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ సగటు ప్రేక్షకుడు సరైన అభిమానాన్ని వ్యక్తపరచకపోతే ఆసినిమాలు ఎలాంటి పరాభవాన్ని చూస్తాయో లేటెస్ట్ గా ముగిసిన సంక్రాంతి రేస్ ఒక ఉదాహరణ..మరింత సమాచారం తెలుసుకోండి: