రవితేజ సినిమాలో ఘట్టమనేని హీరో సుధీర్ బాబు కూడా నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో సుధీర్ బాబు కనిపిస్తారట. రీసెంట్ గా హరీష్ శంకర్ సుధీర్ బాబుని కలిసి కథా చర్చలు జరిపారట. రవితేజ హరీష్ శంకర్ కలిసి చేసిన షాక్ ఫ్లాప్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన మిరపకాయ్ సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు మిస్టర్ బచ్చన్ గా రవితేజతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు నటించడం కూడా ప్రాజెక్ట్ పై భారీ హైప్ తెస్తుంది. హరీష్ శంకర్, రవితేజ కాంబో మాస్ రాజా ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇస్తుంది. రవితేజ సుధీర్ బాబు ఈ కాంబో కూడా కచ్చితంగా ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుందని చెప్పొచ్చు. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న రవితేజ ఈగల్ పై సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. మాస్ రాజా రవితేజ సినిమా అంటే ఆయన ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే. ఈగల్ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకు రాగా సినిమా తో రవితేజ భారీ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు. మిస్టర్ బచ్చన్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి