‘గుంటూరు కారం’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీలో నటించిన మహేష్ కు మాత్రం మంచి ప్రశంసలు లభించాయి. ఆసినిమాలో మహేష్ కాకుండా వేరే హీరో ఎవరు నటించినా ఆ రేంజ్ లో కలక్షన్స్ వచ్చి ఉండేవి కావు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈసినిమా హడావిడి పూర్తి అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి త్వరలో ప్రారంభం కాబోతున్న మహేష్ రాజమౌళిల మూవీ ప్రాజెక్ట్ పై ఉంది.ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వడంతో రాజమౌళి ఈసినిమాకు సంబంధించిన టెక్నికల్ అంశాల పై దృష్టి పెట్టడమే కాకుండా మహేష్ ను ప్రత్యేకంగా జర్మనీకి పంపించి అక్కడ ఉన్న ఈసినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ తో చర్చలు జరిపించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.ఇది ఇలా ఉంటే ఈసినిమా బడ్జెట్ కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈసినిమాను రాజమౌళి 1000 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నట్లు టాక్. దీనితో ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న కె ఎల్ నారాయణ పై ఒత్తిడి లేకుండా ఈసినిమా బడ్జెట్ కు సంబంధించి ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో జక్కన్న చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ చర్చలు ఇలా కొనసాగుతూ ఉండగానే మరొక న్యూస్ ఈసినిమాకు సంబంధించి హడావిడి మొదలు పెట్టింది. ఈసినిమా బడ్జెట్ భారీ స్థాయిలో ఉండటంతో నిర్మాత కె ఎల్ నారాయణకు సహాయపడే విధంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈప్రాజెక్ట్ లో భాగస్వామిని చేసేవిధంగా కొన్ని చర్చలు కూడ ఈమధ్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈసినిమాకు సంబంధించి నిర్మాణ విషయంలో రాజమౌళి ఆలోచనలు వేరుగా ఉన్నాయని పేరుకు ఈమూవీ నిర్మాత కె ఎల్ నారాయణ అయినప్పటికీ మూవీ బడ్జెట్ పెరిగి పోవడంతో ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థను ఈమూవీలో భాగస్వామిగా చేయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: