ఏప్రియల్ 5న విడుదల కావలసి ఉన్న ‘దేవర’ మూవీ విడుదల వాయిదా పడుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్న పరిస్థితులలో ఆ డేట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనేక సినిమా దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సైఫ్ ఆలీఖాన్ కు ప్రమాదం జరిగి గాయం ఏర్పడటంతో ఈ గాసిప్పుల హడావిడి మొదలైంది.దీనికితోడు ఎన్నికలు తెలుగు రాష్ట్రాలలో మార్చి నెలాఖరున కానీ లేదంటే ఏప్రియల్ మొదటి వారంలో కానీ జరిగే ఆస్కారం ఉంది అంటూ స్పష్టమైన సంకేతాలు వస్తున్న పరిస్థితులలో భారీ బడ్జెట్ తో తీసిన ‘దేవర’ మూవీని ఎన్నికల హడావిడి మధ్య విడుదల చేయకపోవడం మంచిది అంటూ కొందరు ఈమూవీ నిర్మాతలకు సూచనలు ఇస్తున్నట్లు టాక్.ఇప్పుడు నడుస్తున్న ఈవిషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోబాలని ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రయత్నిస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. కమలహాసన్ తో శంకర్ తీస్తున్న ‘ఇండియన్ 2’ ఏప్రియల్ 12న రిలీజ్ చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు అనుకోకుండా ‘దేవర’ వాయిదా పడితే ఆ డేట్ ను తనకు అనుకూలంగా మార్చుకుని ‘ఇండియన్ 2’ ను ఏప్రియల్ 5న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అను దర్శకుడు శంకర్ ఈమూవీ నిర్మాతలతో ఆలోచనలు చేస్తునట్లు తెలుస్తోంది.అయితే ‘దేవర’ అనుకోకుండా వాయిదా పడితే ఆ డేట్ ను కబ్జా చేయాలని సిద్దూ జొన్నల గడ్డ ‘టిల్లు స్క్వేర్’ విజయ్ దేవరవకొండ  ఫ్యామిలీ స్టార్ మూవీలు కూడ ‘దేవర’ డేట్ పై కన్ను పడినట్లు సమాచారం. ఏప్రియల్ నెల సమయానికి ఎన్నికల రీత్యా విద్యార్దుల పరీక్షలు చాలముందుగా పూర్తి అవుతున్న పరిస్థితులలో రాబోతున్న ఏప్రియల్ 5 డేట్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ కేక్ గా మారింది. అయితే ‘దేవర’ నిర్మాతలు మటుకు తమ మూవీ రిలీజ్ విషయంలో వస్తున్న వార్తల పై మౌనంగా ఉండటం మరిన్ని సందేహాలను కలిగిస్తోంది అంటూ కొందరి ఆభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: