డియం రేంజ్ సినిమాల దర్శకుడుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు మారుతి కి ఊహించని అదృష్టం ప్రభాస్ రూపంలో వచ్చింది. పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ నటించే సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ మారుతికి రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలకాలం అయినప్పటికీ ఈమూవీ షూటింగ్ ఇప్పటివరకు కేవలం 50 శాతం మాత్రమే పూర్తి అయింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు. లేటెస్ట్ గా మారుతి ఈసినిమాకు సంబంధించి విడుదల చేసిన ‘రాజా సాబ్’ టైటిల్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ లోని ఒకప్పటి కామెడీ యాంగిల్ మళ్ళీ బయటకు తీయాలాని మారుతి చేస్తున్న ప్రయత్నం ‘రాజా సాబ్’ మారుతికి బాగా కలిసి వచ్చిన దెయ్యం సెంటిమెంట్ కూడ ఈమూవీలో ఉండటంతో ఒక డిఫరెంట్ జోనల్ సినిమాగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈమూవీ నచ్చుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ షూటింగ్ చివరి దశకు చేరుకుని రాబోతున్న మేలో ఈమూవీ విడుదలకు రంగం సిద్ధం అవుతున్న నేపధ్యంలో మారుతి ప్రభాస్ తో తాను తీస్తున్న ‘రాజా సాబ్’ షూటింగ్ ను రాబోయే మే నెల నుండి మొదలుపెట్టి వేగంగా పూర్తి చేసి ఈ సంవత్సరం డిసెంబర్ లో కానీ లేదంటే వచ్చే సంవత్సరం సంక్రాంతికి కానీ విడుదల చేయాలాని యాక్షన్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ల ఆలోచనలలో ‘సలార్ 2’ స్పీడ్ అందుకోవడంతో ప్రభాస్ డేట్స్ అన్నీ ‘సలార్ 2’ కు వెళ్ళిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో మళ్ళీ ‘రాజా సాబ్’ షూటింగ్ కు బ్రేక్ లు పడే అవకాశం ఉందని మారుతి లోలోపల భయపడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: