గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర నిరాశతో కాలం గడిపిన అక్కినేని హీరోలకు ఈ సంవత్సరం ప్రారంభం మంచి జోష్ ను ఇచ్చింది. హిట్ అన్న పదం మర్చిపోయి కాలం గడుపుతున్న నాగార్జున లేటెస్ట్ మూవీ ‘నా సామి రంగ’ మూవీ విడుదలైన మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ కు రావడంతో ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు మంచి జోష్ లో ఉన్నారు. ఈసినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు నాగ్ తన స్పీడ్ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో చేస్తున్నాడు.అంతేకాదు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్క్స్ భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఒక వెబ్ సిరీస్ లో నాగార్జున నటించడానికి తన అంగీకారం తెలిపాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా ఇదే సంవత్సరం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు 3’ ని కూడ మొదలుపెట్టి తనకు కలిసివచ్చిన సంక్రాంతి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ వచ్చే సంవత్సరం సంక్రాంతికి తన తన ‘బంగార్రాజు’ సీక్వెల్ ను విడుదల చేయాలని నాగ్ ఆలోచన అని అంటున్నారు.ప్రస్తుతం ఫ్లాప్ ల పర్వంలో కొనసాగుతున్న నాగచైతన్య నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ‘తండల్’ మూవీ కూడ ఈ సమ్మర్ రేస్ లో విడుదల కాబోతోంది. ఈమూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న అఖిల్ ప్రశాంత్ నీల్ సమర్పకుడుగా ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఒక భారీ బడ్జెట్ మూవీలో నటించబోతున్నాడు.ఇలా అక్కినేని హీరోలు అంతా తమ సినిమాల విషయంలో బిజీగా మారడంతో అక్కినేని ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. సినిమాల కలక్షన్స్ 100 కోట్ల ఫిగర్ అన్నది సామాన్యంగా మారిన పరిస్థితులలో కనీసం ఈ సంవత్సరం అయినా అక్కినేన హీరోల సినిమాలు 100 కోట్ల మార్క్ ను అందుకుంటాయేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: