బుల్లితెర ప్రేక్షకులు అందరిని అలరించిన బిగ్ బాస్ ఏడవ సీజన్ ఇటీవలే ముగిసింది. అయితే ఈ ఏడవ సీజన్ ప్రేక్షకులందరికీ వినూత్న రీతిలో అలరించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బిగ్ బాస్ ఏడవ సీజన్లో జరిగిన ఒక విషయం ఇప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అదే అటు బిగ్ బాస్ కంటెస్టెంట్ రతికను ఒక రూమ్ లోకి పిలిచి ఉడతా ఉడుతా ఊచ్ అనే సాంగ్ ని ప్లే చేస్తాడు బిగ్ బాస్.. అయితే చాలాసార్లు ప్లే చేసిన తర్వాత ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ పాటలో ఉడుత అనే పదం వచ్చింది అంటూ బిగ్ బాస్ అడిగితే.. టపీమని సమాధానం చెబుతుంది రతిక. దీంతో అందరూ షాక్ అవుతారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా మరో ఇంట్రెస్టింగ్ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ లో నా సూర్యుడివి నా ఈ మూవీలోని పాటల దగ్గరనుంచి ఫైటింగ్స్ వరకు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ప్రతి కొడుకుకి కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక లవర్ బాయ్ గా ఉన్న రణబీర్ కపూర్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇప్పటికి ఎంతోమంది రింగ్టోన్ కూడా ఈ సినిమాలోని పాటలను పెట్టుకుంటున్నారు. అయితే ఈ మూవీ విషయంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.


 ఈ మూవీలో రణబీర్ కపూర్ తరచూ నాన్న నాన్న అంటూ వెంటపడి మరి తిరుగుతూ ఉంటాడు. కాగా ఈ సినిమా మొత్తం రణబీర్ తన తండ్రిని నాన్న అని ఎన్నిసార్లు పిలిచాడు అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే  ఫాదర్ సెంట్రిక్ ఎమోషన్ తో వచ్చిన ఈ మూవీలో నాన్న అనే పదం 196 సార్లు వచ్చిందట. అయితే తరచూ రణబీర్ కపూర్ నాన్న నాన్న అంటూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఎవరు లెక్క పెట్టారో తెలియదు కానీ ఈ మూవీ మొత్తం లో రణబీర్ కపూర్ తన తండ్రి పాత్రలో నటించినా అనిల్ కపూర్ ని ఏకంగా నాన్న అని 196 సార్లు పిలిచాడట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: