త్వరలో రాజమౌళి మహేష్ ల కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న మూవీ షూటింగ్ కు రంగం సిద్ధం అవుతోంది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేయడంతో ఈమూవీ షూటింగ్ ను వీలైనంత త్వరలో ప్రారంభించాలని జక్కన్న చాల సీరియస్ గా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.మూవీ కథ ఆఫ్రికన్ అడవుల నేపధ్యంలో జరిగే కథ కావడంతో మహేష్ కు ఆఫ్రికన్ అడవుల గురించి అదేవిధంగా అక్కడ షూటింగ్ స్పాట్ లో వ్యహరించవలసిన పద్దతుల గురించితెలియవలసిన కొన్ని టెక్నికల్ విషయాల పై అవగాహన కల్పించడానికి మహేష్ ను ప్రత్యేకమైన ట్రైనింగ్ కోసం జర్మనీ పంపిన విషయం తెలిసిందే. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ ప్రాజెక్ట్ పై పెట్టుబడి 1000 కోట్ల రేంజ్ లో ఉంటుంది అంటున్నారు. అంహర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ రేంజ్ లో నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీ షూటింగ్ ఇంచుమించు రెండు సంవత్సరాలు పట్టే ఆస్కారం ఉంది అంటున్నారు. దీనితో రాజమౌళి ఈమధ్య మహేష్ ను కలిసి తన సినిమా ప్రాజెక్ట్ వల్ల మహేష్ కు రెండు సంవత్సరాలు మరో సినిమా చేయకుండా ఖాళీగా ఉండవలసి వస్తుంది కాబట్టి ఈమూవీ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా మారామని మహేష్ ను జక్కన్న కోరినట్లు సమాచారం.ఈవిషయమై మహేష్ స్పందిస్తూ తన పారితోషికం విషయాల గురించి పెద్దగా పట్టించుకోవద్దనీ ప్రాజెక్ట్ రేంజ్ గురించి మాత్రమే ఆలోచనలు చేయమని తాను ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు మరొక సినిమాను చేయనని చెప్పడమే కాకుండా తాను ఈమూవీ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉండటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న రాజమౌళి కూడ తాను ఈ మూవీ ప్రాజెక్ట్ పూర్తి అయి విడుదల అయ్యేంతవరకు తనకు ఒక్క రూపాయి కూడ పారితోషికం తీసుకోకూడదు అని స్థిర నిర్ణయంలో ఉన్నట్లు టాక్..మరింత సమాచారం తెలుసుకోండి: