విజయ్ దేవరకొండ తరువాత యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విశ్వక్ సేన్ ముందు వరసలో ఉంటాడు. దీనికితోడు అతడు ఫిలిమ్ ఫంక్షన్స్ లో తరుచూ చేసే వివాదాస్పద వ్యాఖ్యలు వల్ల అతడు తరుచూ మీడియాలో కూడ చాల ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాడు. డిఫరెంట్ కథలతో సినిమాలు చేయాలి అని తాపత్రయ పడే ఈ యంగ్ హీరో అఘోరా పాత్రలో నటిస్తున్నాడు అన్న వార్తలు సంచలనంగా మారాయి.అఘోరా పాత్రను చేసి మెప్పించడం చాల కష్టమైన పని. గతంలో కొంతమంది హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన సందర్భాలు కూడ ఉన్నాయి. సుమారు 30 ఏళ్ళ క్రితం రాజేంద్ర ప్రసాద్ ‘కాష్మోరా’ లో అఘోరా పాత్రలో మెప్పించలేక పోయాడు. అయితే ‘అఖండ’ మూవీలో ఇదే ప్రయత్నాన్ని బాలకృష్ణ చేసి అందర్నీ మెప్పించడమే కాకుండా ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ‘అఖండ 2’ గురించి చర్చలు జరుగుతున్నాయి.బాలకృష్ణను ఆలస్యంగా ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు విశ్వక్ సేన్  అఘోరాగా నటించిన ‘గామి’ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాను సహజత్వం కోసం సహజమైన లొకేషన్లలో మంచు కురిసే హిమాలయ ప్రాంతాలలో చాల కష్టపడి తీసినట్లు వార్తలు వస్తున్నాయి.  విద్యాధర్ కగిత అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పిరిచువల్ థ్రిల్లర్ లో చాల షాకింగ్ అంశాలు ఉంటాయని అంటున్నారు.మార్చి 8న ఈ యంగ్ హీరో నటించిన ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ మూవీ రావలసి ఉంది. అయితే ఇప్పుడు ఆ మూవీని వెనక్కు జరిపి ‘గామి’ మూవీని మార్చి 8న విడుదల చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. డిఫరెంట్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ బాగా వస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ మూవీ తనకు మంచి హిట్ తెచ్చి పెడుతుందని విశ్వక్ సేన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..మరింత సమాచారం తెలుసుకోండి: