గత కొంతకాలం నుంచి సౌత్ ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది మృనాల్ ఠాగూర్. ఒకప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేదు. కానీ ఎప్పుడైతే సీతారామం అనే సినిమాలో నటించిందో ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సినీ ప్రేక్షకులందరికీ కూడా దగ్గర అయింది. ఈ మూవీలో సీత అనే పాత్రలో నటించి తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన తర్వాత కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే తెలుగులో కూడా ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మా. మొన్నటికి మొన్న న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో నటించి ఈ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతుంది మృనాల్ ఠాగూర్. అయితే ఇలా హీరోయిన్ గా హవా నడిపిస్తున్న మృనాల్  తన కెరీర్ గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదివరకు కథ బలం ఉన్న సినిమాల్లో నటించడం కారణంగా.. తనకు డాన్స్ చేసే అవకాశం రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ 30 మూవీలో కూడా మృణాళి ఠాగూర్ నటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. హృతిక్ తో  నటించాను. కానీ ఆయనతో డాన్స్ చేసే అవకాశాన్ని మాత్రం దక్కించుకోలేదు. ఇప్పటికీ ఈ విషయంపై బాధపడుతుంటాను అంటూ మృనాల్ చెప్పుకొచ్చింది. ఇక తన సినిమాలో డాన్స్ స్కోప్ లేకపోవడంతో తెర వెనుక చేస్తాను అంటూ తెలిపింది. అయితే ఇప్పటివరకు సినిమాల్లో పెద్దగా డాన్స్ చేయలేదు అన్న లోటుని విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ తీరుస్తుంది అంటూ మృనాల్ ఠాగూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: