మలయాళ హీరో పృధ్వి రాజ్ సుకుమార్ చేసే ప్రతి సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. డిఫరెంట్ స్టోరీస్ తో పృధ్వి రాజ్ చేసే సినిమాలు సౌత్ ఆడియన్స్ ని ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలు ప్రయత్నించిన పృధ్విరాజ్ అప్పుడు రాని క్రేజ్ ఇమేజ్ ఈమధ్య అతను నటించిన మలయాళ సినిమాల డబ్బింగ్ వల్ల వచ్చింది.

ఇక రీసెంట్ గా సలార్ 1 లో వరద రాజమన్నార్ పాత్రలో పృధ్వి రాజ్ సుకుమార్ నటించాడు. ప్రభాస్, పృధ్విరాజ్ ఇద్దరు స్నేహితులుగా మంచి బాండింగ్ చూపించారు. అయితే సలార్ 1 లో పృధ్వి రాజ్ కి కాస్త స్కోప్ తక్కువే ఉందని అనిపించింది. అతని విశ్వరూపం సెకండ్ పార్ట్ లో ఉంటుందని అర్ధమవుతుంది.

ఇదిలాఉంటే పృధ్విరాజ్ ప్రెస్టీజియస్ గా చేస్తున్న సోలో మూవీ థ గోట్ లైఫ్. తెలుగులో ది గోట్ లైఫ్ ఆడు జీవితం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను తెలుగులో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్యనే డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెట్టిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇక మీదట భారీ సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకస్ వల్ల ది గోట్ లైఫ్ ఆడు జీవితంకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది.

ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. సలార్ తర్వాత పృధ్వి రాజ్ తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు కాబట్టి ఈ గోట్ లైఫ్ కచ్చితంగా తెలుగు ఆడియన్స్ కు బాగా రీచ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీలో పృధ్వి రాజ్ డిఫరెన్ గెటప్స్ లో వావ్ అనిపించేలా ఉన్నాడు. డిఫరెంట్ మూవీగా వస్తున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: