సంక్రాంతి పండుగ సీజన్ టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ టైమ్ లాంటిది. దీనితో భారీ సినిమాలు అన్నీ కలక్షన్స్ కోసం సంక్రాంతి బాట పడతాయి. లేటెస్ట్ గా ముగిసిన సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదలైన ‘గుంటూరు కారం’ మూవీకి విపరీతమైన డివైడ్ టాక్ తో పాటు ఆమూవీలోని పాటలు పెద్దగా పాపులర్ అవ్వనప్పటికీ ఈమూవీకి 100 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ రావడం పరిశీలిస్తే సంక్రాంతి సినిమాల మ్యానియా సగటు ప్రేక్షకుడి పై ఏరేంజ్ లో ఉంటుందో అర్థం అవుతుంది.



ఈసంవత్సరం ముగిసిన సంక్రాంతి రేస్ లో ‘హనుమాన్’ విజేతగా నిలవడంతో ఇప్పుడు రాబోతున్న సమ్మర్ రేస్ గురించి కాకుండా వచ్చే సంవత్సరం రాబోయే సంక్రాంతి సినిమాల గురించి అప్పుడే మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ సీనియర్ హీరోల సినిమాల మధ్య ఉండబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.



రాబోయే సంక్రాంతికి విడుదలకాబోయే సినిమాలలో భారీఅంచనాలు   చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ పై ఉన్నాయి. భారీ గ్రాఫిక్స్ తో తీయబోతున్న ఈమూవీ చిరంజీవి కెరియర్ లో రికార్డులు క్రియేట్ చేసి ఒకనాటి ‘జగదీకవీరుడు అతిలోకసుందరి’ రోజులు గుర్తుకు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈసంవత్సరం సంక్రాంతికి ‘నా సామి రంగా’ తో హిట్ కొట్టిన నాగార్జున తన సంక్రాంతి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ వచ్చేసంవత్సరం సంక్రాంతికి కూడ తన సినిమాను రంగంలోకి దింపాలని ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈసంవత్సరం ‘సైంధవ్’ తో పరాజయాన్ని అందుకున్న వెంకటేష్ ఆషాక్ నుండి తెరుకుని తనకు హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడితో మళ్ళీ జతకట్టి మరో కామెడీ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇక బాబి దర్శకత్వంలో బాలకృష్ణ ఇప్పటికే మొదలుపెట్టిన మూవీ ఎన్నికల హడావిడితో ఆగిపోవడంతో ఎన్నికల తరువాత బాలయ్య మళ్ళీ ఈమూవీ షూటింగ్ ను మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తిచేసి తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే సంక్రాంతి రేస్ లో నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో సీనియర్ హీరోల స్టామినాకు వచ్చేసంక్రాంతి పరీక్ష పెట్టబోతోంది..  




మరింత సమాచారం తెలుసుకోండి: