సంక్రాంతి సినిమాల హంగామా ముగిసిపోవడంతో ప్రస్తుతం చిన్న సినిమాల హడావిడి కొనసాగుతోంది. ఈనేపధ్యంలో ఈవారం విడుదలకాబోతున్న రవితేజా ‘ఈగల్’ పరిస్థితి పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ‘ధమాక’ తో ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజ ఆతరువాత నటించిన ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ వరస ఫ్లాప్ లుగా మారడంతో ఇప్పుడు రవితేజా దృష్టి అంతా ‘ఈగల్’ పైనే ఉంది.వాస్తవానికి ఈసినిమాను సంక్రాంతి రేస్ లోకి తీసుకురావాలని భావించిన తరుణంలో అప్పటికే ఘాట్ చేసిన ప్రమోషన్ ఇంటర్వ్యూలు అదేవిధంగా ఈసినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ వరసపెట్టి విడుదల చేస్తూ ఉన్నప్పటికీ ఈసినిమా పై ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో మ్యానియా ఏర్పడకపోవడం ఈమూవీ బయ్యర్లను భయపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎందుకనో ఇప్పటికీ ఈమూవీ గురించి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ రాకపోవడం కొంతమందిని ఆశ్చర్య పరుస్తోంది.  ఈమూవీ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి ప్రత్యేకంగా ఒక ఇమేజ్ అంటూ లేకపోవడం ఈసినిమాకు అనుకోని నెగిటివ్ పాయింట్ గా మారుతుందా అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి. గతంలో ఇతడు నిఖిల్ తో తీసిన ‘సూర్య వర్సెస్ సూర్య’ చెప్పుకోతగ్గ స్థాయిలో విజయవంతం కాకపోవడంతో ఈమూవీ దర్శకుడి గురించి చాలామందికి తెలియదు. అయితే ఈమూవీలో భారీ క్యాస్టింగ్ తో పాటు కథ చాల డిఫరెంట్ గా ఉంటుందని రవితేజా అంటున్నాడు.లేటెస్ట్ గా విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ కి టాక్ బాగానే ఉన్నప్పటికీ ఈసినిమాకు చెప్పుకోతగ్గ కలక్షన్స్ లేవు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈసినిమా తప్ప గతవారం విడుదలైన చిన్న సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. దీనితో బోసిపోతున్న ధియేటర్లను ఎంతవరకు ‘ఈగల్’ రక్షించగలదు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. సంక్రాంతి తరువాత టాప్ హీరోల సినిమాలు ఏవీ విడుదల కాని పరిస్థితులలో ‘ఈగల్’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే చాలు కలక్షన్స్ విషయంలో మాస్ మహారాజా ఎదురు చూసుకోవలసిన పరిస్థితి లేదు అంటూ అతడి అభిమానులు అంచనాలు వేస్తున్నారు..  మరింత సమాచారం తెలుసుకోండి: