ప్రియాంక జైన్.. ప్రస్తుతం ఈమె తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా బాగా సుపరిచితురాలుగా మారిపోయింది. అయితే సీరియల్స్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈమె  బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ లో తన ఆట తీరుతో ఏకంగా ప్రేక్షకులను ఆకట్టుకొని టాప్ 5 వరకు వెళ్ళగలిగింది ప్రియాంక. అయితే ఈ షో లో కొనసాగుతున్న సమయంలోనే తన ప్రియుడు శివకుమార్ ను పరిచయం చేసింది.


 కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఇక ప్రియాంక శివ కుమార్ అటు సోషల్ మీడియాలో తమ వీడియోలతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఏకంగా తన తొలి బాయ్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేసింది ప్రియాంక. అయితే అతనికి మౌనరాగం సీరియల్ హీరోగా మొదట ఛాన్స్ వచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల అతను సీరియల్ కి నో చెప్పాడట. అక్కడే ప్రియాంకతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందట. కానీ అతను బ్రేకప్ చెప్పడంతో ప్రియాంక తర్వాత శివకుమార్ ని కలవడం అతనితో ప్రేమలో పడటం జరిగిందట.


 అయితే ఇటీవల తన ఫస్ట్ లవర్ తో కలిసి ప్రియాంక లంచ్ కి వెళ్ళింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా శివకుమార్ ను పిలుస్తాడు ప్రియాంక మాజీ లవర్. ఇక అతను వచ్చిన తర్వాత నేను రిజెక్ట్ చేయడం వల్లే ప్రియాంక నీకు దక్కింది. నేను నీకు బిక్ష వేశాను అన్నట్లుగా డైలాగులు చెబుతాడు. అయినప్పటికీ శివకుమార్ కి కోపం రాదు. ఎందుకో తెలుసా? అక్కడ ఇలాంటి బిల్డప్ లు ఇచ్చేది ఎవరో కాదు టేస్టీ తేజ. టేస్టీ  తేజ ప్రియాంక తింటుండగా మధ్యలో శివకుమార్ వచ్చాడు. నా వల్లే నీకు ప్రియాంక దొరికింది. నేను నో చెప్పడం వల్ల నీకు అవకాశం వచ్చింది. ప్రియాంక మొదటి నాకే ప్రపోజ్ చేసింది అంటూ శివకుమార్ ని ఆటపట్టిస్తాడు టేస్టీ తేజ.

మరింత సమాచారం తెలుసుకోండి: