కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ మరికొన్ని రోజుల్లోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమా ల్లో నటించను అని విజయ్ తాజాగా ప్రకటించాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే ఈయన తన కెరీర్ లో 69 వ సినిమాలో నటించబోతున్నట్లు ఇదే తన కెరియర్ లో ఆఖరి సినిమా కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించబోతున్నాడు.

ఇకపోతే ఇప్పటికే v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య నిర్మించబోయే సినిమాకు తలపతి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానితో దానయ్య , విజయ్ తో అదిరిపోయే సినిమాను రూపొందించేందుకుగాను పలువురు దర్శకులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు తో కొన్ని రోజుల క్రితమే దానయ్య సంప్రదింపులో జరిపినట్లు తెలుస్తోంది.

కాకపోతే ఈయన వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల విజయ్ తో దానయ్య బ్యానర్ లో సినిమా చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దానయ్య ... హెచ్ వినోద్ , వెట్రీ మారన్ లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎక్కువ శాతం వేట్రి మారన్ తోనే విజయ్ 69.వ మూవీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బలంగా వినబడుతుంది. మరి విజయ్ తన 69 వ సినిమాని ఏ దర్శకుడు తో చేస్తాడో అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: