పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ మారిపోవడంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘పుష్ప 2’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈమూవీకి సంబంధించి వస్తున్న వార్తలు ఈమూవీ పై మరింత క్రేజ్ ను పెంచుతున్నాయి. ఈసినిమా కోసం పెంచిన జుత్తు గడ్డంతో అల్లు అర్జున్ గత 4 సంవత్సరాలుగా కేవలం ఈసినిమా కోసమే తన దృష్టిని పెడుతున్నాడు అంటే ఈమూవీ కోసం బన్నీ ఏరేంజ్ లో కష్టపడుతున్నాడో అర్థం అవుతుంది.ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సుకుమార్ ఈసినిమా కథను పార్ట్ 2 తో ముగించలేకపోతున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి. దీనితో ఈమూవీ పార్ట్ 3 తప్పనిసరి అన్నసంకేతాలు వస్తున్నాయి. దీనితో సుకుమార్ ‘పుష్ప’ మూవీని వెబ్ సిరీస్ గా తీస్తున్నాడా అంటూ సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు కూడ వేస్తున్నారు.  ఈసినిమాకు సంబంధించి జపాన్ ఎపిసోడ్ లో వచ్చే జాతరలో బన్నీ చీర కట్టుకుని చేసే ఫైట్ యాక్షన్ సీన్స్ తో థియేటర్ లు బద్ధలు అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇక ఫహద్ ఫాసిల్ అల్లు అర్జున్ మధ్య క్లాష్ ని మూడో భాగంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ‘పుష్ప’ పార్ట్ 2 లో కొత్త పాత్రలు చాల పరిచయం అవుతాయని దీనితో ఈమూవీని పార్ట్ 2తో సుకుమార్ ముగించలేకపోతున్నాడు అని అంటున్నారు.ది రూల్ పేరుతో షూటింగ్ దశలో ఉన్న ‘పుష్ప 2’ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ను ది రోర్ పేరుతో సుకుమార్ ‘పుష్ప 2’ ను పూర్తి చేయబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. దీనితో ఈమూవీకి సంబంధించి పార్ట్ 3 ఖచ్చితం అని అంటున్నారు. అయితే ఈవార్తలే నిజం అయితే బన్నీ ఇప్పటికే కమిట్ అయిన త్రివిక్రమ్ బోయపాటి సందీప్ వంగా లతో నటించవలసిన సినిమాలు ఎప్పుడు ప్రారంభం అయి ఎప్పటికీ పూర్తి అయి రిలీజ్ అవుతాయి అన్నది సమాధానం లేని ప్రశ్న..మరింత సమాచారం తెలుసుకోండి: