ఇటీవల కాలం లో ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారాలు ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎన్నో ఏళ్ల పాటు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్నవారు. విడాకులు తీసుకుని వేరు పడటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇలా విడాకులకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ చివరికి అభిమానులందరినీ కూడా షాక్ లో మునిగిపోయేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే అటు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల వ్యవహారం కూడా ఇలాగే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.


 స్టార్ హీరో ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల పాటు అన్యోన్య దంపతులుగా కొనసాగారు. ఇక ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అని పేరును సంపాదించుకున్నారు. కానీ ఈ ఇద్దరు కూడా ఏకంగా 18 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అని చెప్పాలి. ఇక విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరు కూడా అటు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం విడాకులు తీసుకోకపోయినప్పటికీ ఇక ఇద్దరూ వేరు వేరు గానే ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమం లోనే విడాకుల తర్వాత వీరి జీవితం ఎలా సాగిపోతుంది అనే విషయం పై ఏదైనా ఇంటర్వ్యూ లో స్పందించి అసలు విషయాలను చెబుతారేమో అని అటు అభిమానులకు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ధనుష్ తో విడాకులు తీసుకోక పోయినప్పటికీ అతనికి దూరంగా ఉంటున్న ఐశ్వర్య రజనీకాంత్ ఇక తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రెండేళ్లుగా ఒంటరితనంతోనే సాహసం చేస్తున్నాను. ఇక ఒంటరితనాన్ని ఆస్వాదిస్తున్నాను. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నప్పుడే సురక్షితంగా ఉండగలం అని గ్రహించాను అంటూ ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: