అనేకసార్లు నంది అవార్డులు ఫిలిమ్ ఫేర్ అవార్డులు పొంది దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తాను నటించబోతున్న సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్నాడు అంటే ఎవరు నమ్మలేని విషయం. కానీ సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడని రాజమౌళి మహేష్ ను సీనియర్ హీరోగా కాకుండా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక యంగ్ హీరోగా భావిస్తూ అతడి లుక్ లో మాత్రమే కాకుండా అతడి బాడీ లాంగ్వేజ్ లో కూడ అనేక మార్పులు తీసుకురావడానికి ప్రస్తుతం రిహార్సల్స్ చేయిస్తున్నట్లు టాక్.కొన్ని రోజుల క్రితం రాజమౌళి సూచనాలతో జర్మనీ వెళ్ళి అక్కడ ట్రైనర్స్ తో తన ఫిజికల్ ఫిట్నెస్ ను మహేష్ జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక్క రోజు కూడ ఆలస్యం చేయకుండా జక్కన్న నిర్వహించే వర్క్ షాపులకు ఒక కాలేజీ విధ్యార్ధిలా హాజర్ అవుతున్నట్లు సమాచారం. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీలో ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఉండటానికి ముందుకు రావడంతో దానికి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఆఫ్రికా అడవులలో నిర్మాణం జరుపుకోబోయే ఈమూవీ షూటింగ్ ను ఎట్టి పరిస్థితులలోనూ ఈసమ్మర్ లో మొదలుపెట్టాలని రాజమౌళి చాల గట్టి పట్టుదల పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తి కావడంతో ఈమూవీకి సంబంధించిన కీలక నటీనటుల ఎంపిక పై రాజమౌళి దృష్టి పెట్టినట్లు టాక్.ఇది ఇలా ఉండగా ఈమూవీలో ఒక కీలక పాత్రలో నటించే విషయంలో నాగార్జునతో జక్కన్న చర్చలు జరుపుతున్నారు అన్న వార్తలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు నాగార్జున ఎప్పటి నుంచో సుపరిచితుడు కాబట్టి మహేష్ మూవీలో అతడు కీలక పాత్రలో నటిస్తే బాలీవుడ్ మార్కెట్ లో తన సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుందని రాజమౌళి వ్యూహం అని అంటున్నారు..  
మరింత సమాచారం తెలుసుకోండి: