
తెలంగాణ యాసలో మాట్లాడే సుజాత రాకేష్ ను వివాహం చేసుకున్న తర్వాత యాంకర్ గా గుడ్ బై చెప్పేసి జబర్దస్త్ రాకేష్ తో కలిసి కొన్ని స్కిట్లలో కనిపిస్తోంది. ప్రస్తుతం సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా మొదలుపెట్టారు..తమ జీవితంలో మధుర క్షణాలను ఎలాంటి విషయాలనైనా సరే అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది సుజాత. ఇప్పుడు తాజాగా సుజాత చేసిన పనికి రాకేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
సుజాత ఇటీవలే వాస్తు బాగలేదంటూ తన ఇంటిని మొత్తం ఖాళీ చేసింది.. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఒక ఇల్లు కొన్నాను అంటూ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని సైతం షేర్ చేసింది. తన భర్తకు తెలియకుండా ఒక ఫ్లాట్ కొన్నట్లుగా చూపించింది.. దాదాపుగా 17వ అంతస్తులో ఈ ఫ్లాట్ ఉన్నట్లుగా ఈ వీడియోలో చూపించింది సుజాత.. అంతేకాకుండా ఈ ఇల్లు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను అంటూ తెలిపింది. దీంతో రాకేష్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.. నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినందుకు తనకు చాలా ఆనందంగా ఉందంటూ ఆమెను చూస్తూ మురిసిపోయాడు.. ఇంతలోనే ఊహించని విధంగా సుజాత మాట్లాడుతూ ఈ ఇల్లు తాను కొనలేదని పక్కింటి వాళ్ళు కొన్న ఇల్లు అంటూ తెలిపింది. దీంతో ఒక్కసారిగా రాకేష్ ముఖం వాడిపోయింది.