సమంత కెరియర్ ఎంత వేగంగా పరుగులు పెట్టిందో అంత వేగంగా ఇప్పుడు ఫేడవుట్ అవుతోందా అని చాలామందికి సందేహాలు వస్తున్నాయి. టాప్ హీరోయిన్ స్థాయిని ఎంజాయ్ చేసిన ఆమెకు వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలతో పాటు ఆరోగ్యపరంగా ఏర్పడిన సమస్యలు రెండు ఒకదాని వెంట ఒకటి ఆమెను చుట్టుముట్టినప్పటికీ ఆమె ఆ రెండు సమస్యలను చాల ధైర్యంగానే ఎదురకుంది.


ప్రస్తుతం ఆమెకు వచ్చిన మయోసైటీస్ వ్యాధి నుండి చాలవరకు కొలుకున్నప్పటికీ ఆమెకు ఇండస్ట్రీ నుండి ఎటువంటి అవకాశాలు రావడంలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ యంగ్ హీరోలు మాత్రమే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడ ఆమెతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో గత కొంతకాలంగా హాదావీడి చేస్తున్నాయి.


హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగా ఆమె ఎదగాలని చేసిన ప్రయత్నాలు కూడ పెద్దగా సక్సస్ కాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఆమె కెరియర్ క్రాస్ రోడ్స్ లో ఉంది అన్న అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్యనే మెగా స్టార్ చిరంజీవి హీరోగా మొదలైన ‘విశ్వంభర’ మూవీ కోసం ఆమూవీ దర్శక నిర్మాతలు చేసిన అన్వేషణలో అనుష్క సమంత ల పేర్లు చర్చలలోకి వచ్చినప్పటికీ చివరికి ఎంపిక మాత్రం త్రిషకు దక్కింది.


కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మాత్రమే కాదు కాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి కూడ పెద్దగా అవకాశాలు రావడం లేదు అన్న చర్చలు కూడ ఉన్నాయి. ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్ ల సమస్య వెంటాడుతోంది. దీనితో చాలామంది దర్శకులకు సీనియర్ హీరోల డేట్స్ లభించినప్పటికీ హీరోయిన్స్ ఎంపిక విషయంలో ‘విశ్వంభర’ యూనిట్ ఎన్నో ఆలోచనలు చేసినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా దానికితోడు మన దేశంలో కూడ సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకని కష్టశమయంలో కనీసం సీనియర్ హీరోలు అయినా సమంత ను ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: