టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ కి శక్తి ప్రతాప్ సింగ్ హాడ దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ బ్యూటీ మనుషి చిల్లర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా ఫిబ్రవరి 20 వ తేదీన ఉదయం 11 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ సినిమాని ఒకే సారి తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు మరియు తమిళ ట్రైలర్ లను కూడా ఒకే సారి విడుదల చేయబోతుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించి అప్డేట్ విడుదల కాగానే ఈ మూవీ యొక్క తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విడుదల చేయనున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ వార్తలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉదయం 11 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ... ఈ మూవీ యొక్క హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఉదయం 11 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: