తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ధనుష్ కి సోదరుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ లో శివరాజ్ కుమార్ పాత్ర నిడివి చాలా తక్కువ అయినప్పటికీ అందులోనే ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. 

ఇక ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకున్నాడు. ఇక మంచి అంచనాల నడుమ జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం ధనుష్ తానే హీరో గా నటిస్తూ తానే స్వయంగా ఓ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ కి రాయన్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఈ మూవీ బృందం అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే కళానిధి మరన్ నిర్మిస్తున్న ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: