మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కన్నడ సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను మొదలు పెట్టింది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియోను ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది  అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను కూడా విడుదల చేసింది.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి గల్లీ సందుల్లో అంటూ సాగే సాంగ్ యొక్క ప్రోమోను ఈ రోజు ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ... ఇక ఈ మూవీ లోని ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరికల్ వీడియోను ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ లో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని పోస్టర్ లను ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా ... వాటికీ అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: