టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందినటువంటి సైంధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ఏన్ని కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 2.67 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.17 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.72 , ఈస్ట్ లో 91 లక్షలు , వెస్ట్ లో 49 లక్షలు , గుంటూరు లో 76 లక్షలు , కృష్ణ లో 74 లక్షలు , నెల్లూరు లో 34 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 8.80 కోట్ల షేర్ , 15.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 53 లక్షలు , ఓవర్ సీస్ లో 1.02 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10.35 కోట్ల షేర్ , 19.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , 26 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయ్యే సరికి 15.65 కోట్ల నష్టాలను అందుకొని భారీ అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: