ప్రముఖ సర్వే సంస్థలలో ఒకటి అయినటువంటి ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా తెలుగు లో టాప్ 10 హీరోయిన్ లు ఎవరు అనే విషయంపై జనవరి 2024 కు గాను ఓ సర్వేను నిర్వహించారు. అందులో భాగంగా టాప్ 10 లో నిలిచిన హీరోయిన్ లు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం సమంత ఈ సంవత్సరం జనవరి నెలకు గాను మొదటి స్థానంలో నిలిచింది. ఇకపోతే ఈ బ్యూటీ ఆఖరుగా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఖుషి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో కాజల్ అగర్వాల్ రెండవ స్థానంలో నిలిచింది. ఈమె ఆఖరుగా భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సర్వే ప్రకారం మూడవ స్థానంలో శ్రీ లీల నిలిచింది. ఈ బ్యూటీ తాజాగా గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సర్వే ప్రకారం అనుష్క శెట్టి నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ ముద్దుగుమ్మ చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సర్వే ప్రకారం సాయి పల్లవి ఐదవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ థండెల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రష్మిక మందన ఈ సర్వేలో 6 వ వ స్థానంలో నిరచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అనేక క్రేజీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఈ సర్వేలో 7 వ స్థానంలో నిలవగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని తమన్నాసర్వే లో 8 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఈ సర్వే ప్రకారం కీర్తి సురేష్ 9 వ స్థానంలో నిలవగా , అనుపమ పరమేశ్వరన్ ఈ సర్వే లో 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: