మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఒక దాని తర్వాత ఒకటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి.ఇకపోతే చిరంజీవి ఇటీవల ఇండియన్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మవిభూషణ్ కి ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డు అందుకోవడంతో ఇండస్ట్రీలోని వ్యక్తులు, అభిమానులు చిరుకి సత్కారం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న అభిమానులు చిరంజీవిని ఘనంగా సత్కరించడం కోసం అక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేసారు.టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సత్కార వేడుక చాల ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నాకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు, అలాగే తనని ఇంతలా అభిమానిస్తున్న ప్రేక్షకుల అభిమానం నాకు అవార్డుకి దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు మెగాస్టార్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా త్వరలోనే టాలీవుడ్ ఫిలిం కౌన్సిల్ ఘనంగా ఒక సత్కార సభని చేయబోతుంది. ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీలోని హీరోలు, స్టార్ మేకర్స్ అంతా కూడా వచ్చేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇక ఆ ఈవెంట్ కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ లో మెగా హీరోలతో పాటు ఇతర హీరోలను కూడా ఒకే వేదిక పై చూడొచ్చని క్యూరియాసిటీతో ఉన్నారు. మరి ఆ ఈవెంట్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి మారి. ఇకపోతే చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో గ్రాఫికల్ వండర్ గా రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేలా సిద్ధం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: