సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు లాభం వచ్చిందా ..? నష్టం వచ్చిందా అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 33.85 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  సిడెడ్ ఏరియా లో 9.75 కోట్లు ,  ఉత్తరాంధ్ర లో  12.65 కోట్లు , ఈస్ట్ లో 9.80 కోట్లు , వెస్ట్ లో 6 కోట్లు , గుంటూరు లో 8.30 కోట్లు , కృష్ణ లో 6.48 కోట్లు , నెల్లూరు లో 3.67 కోట్ల కనెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఫీస్ రన్ ముగిసే సరికి 90.50 కోట్ల షేర్ ... 139.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొత్తం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.56 కోట్లు , ఓవర్ సీస్ లో 14.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 111.81 కోట్ల షేర్ ... 184.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ దాదాపు 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా ఈ సినిమా  టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 21.19 కోట్ల నష్టాలను అందుకొని యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: