ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 11 మూవీస్ ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 415 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 330 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలవగా ... ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ 234.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరో గా రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 203 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలవగా ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 186.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది.


సినిమా తర్వాత మహేష్ బాబు హీరో గా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా 177.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 6 వ స్థానంలో నిలవగా ... బాహుబలి సినిమా 175.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 7 వ స్థానంలో నిలిచింది. ఇక సైనా నరసింహా రెడ్డి మూవీ 168 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 8 వ స్థానంలో నిలవగా ... రంగస్థలం సినిమా 160 కోట్ల కలెక్షన్ లతో 9 వ స్థానంలో నిలిచింది. హనుమాన్ సినిమా 148.60 కోట్ల కలెక్షన్ లతో పదమ స్థానంలో నిలవగా ... గుంటూరు కారం సినిమా 139.80 కోట్ల కలెక్షన్ లతో 11 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: