తెలుగు సినీ పరిశ్రమలో యువ నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే అనేక సినిమాలలో హీరో గా నటించి మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈయన నటుడు మరియు దర్శకుడు అయినటువంటి అర్జున్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ కొంత కాలం పాటు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు.

ఇక అలాంటి సమయం లోనే నటుడు అర్జున్ తెలుగు సినీ నటుడు అయినటువంటి విశ్వక్ నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే కొన్ని తేదీలను కూడా ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన సినిమా షూటింగ్ చేయడానికి నాకు ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు. అలాంటి వ్యక్తి తో సినిమా చేసి అనవసరం. ఆ సినిమాను క్యాన్సిల్ చేస్తున్నాను అని అధికారికంగా ప్రకటించాడు. ఆ తర్వాత విశ్వక్ ఈ వార్తలను ఖండించాడు. ఇకపోతే తాజాగా విశ్వక్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా అర్జున్ తో జరిగిన పూర్తి విషయాన్ని ఈయన వెల్లడించాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ... నేను అర్జున్ తో సినిమా చేయాలి అనుకున్నాను. నాకు కొన్ని పనులు ఉండడం వల్ల నేను ఒక్క రోజు షూటింగ్ వాయిదా వెయ్యమన్నాను. సినిమా చేయను అని చెప్పలేదు. దానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు అన్నారు. నేను బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోను అయినట్లు అయితే ఆయన అలా చేసేవారా. నేను తీసుకున్న పారితోషం కూడా రెట్టింపు చేసి ఆయనకు తిరిగి ఇచ్చేసా అని విశ్వక్ , అర్జున్ తో వచ్చిన విభేదాల గురించి తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: