నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో పరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్ విషయం మన అందరికీ తెలిసిందే. ఇక పోయిన సంవత్సరం బాలయ్య మొదటగా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత భగవంత్ కేసరి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు టైటిల్ ను ఇప్పటి వరకు ఈ మూవీ బృందం పెట్టకపోవడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం శర వేగంగా పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య తన తదుపరి మూవీ పై ప్రస్తుతం ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలం లోనే పలువురు దర్శకులు చెప్పిన కథలను విన్న బాలయ్య ఓ యంగ్ డైరెక్టర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ దర్శకులను రాహుల్ సాంకృత్యాయన్ ఒకరు. ఈయన ఇప్పటికే టాక్సీవాలా ... శ్యామ్ సింగరాయ్ మూవీ లకు దర్శకత్వం వహించి రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ యువ దర్శకుడు తాజాగా బాలయ్య కు ఓ కథను వినిపించినట్లు ... ఆ కథ అద్భుతంగా నచ్చడంతో బాలయ్య వెంటనే ఈ యువ దర్శకుడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: