ప్రభాస్ హీరోగా రూపొందిన ఆఖరి 6 మూవీ లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సలార్ : ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 217.13 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ లో జగపతి బాబు ,  పృధ్విరాజ్ సుకుమారన్ , శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరో గా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 109.50 షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రాదే శ్యామ్ : ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 72.20 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

సాహో : ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 112.73 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి 2 : ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 320 కోట్ల షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

బాహుబలి 1 : ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 194 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: