తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ లలో సదా ఒకరు. ఈ ముద్దు గుమ్మ నితిన్ హీరో గా తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడం అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అద్భుతమైన క్రేజ్ కలిగిన సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా చాలా సంవత్సరాల పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీ వైపు తన ఇంట్రెస్ట్ ను చూపించింది. అందులో భాగంగా కొన్ని తమిళ సినిమాలలో కూడా ఈ బ్యూటీ నటించింది. ఈ ముద్దు గుమ్మ నటించినటువంటి తమిళ సినిమాలలో విక్రమ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన అపరిచితుడు మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈ బ్యూటీ కి తమిళ్ లో కూడా సూపర్ క్రేజ్ లభించింది. ఇక ఆ తర్వాత ఈమెకు వరుస అపజయాలు రావడంతో ఇటు తెలుగు ... అటు తమిళ్ లో కూడా అవకాశాలు చాలా వరకు తగ్గాయి. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే టీవీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని అంతే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సదా కు సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: