మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎప్పటి కప్పుడు వరుస సినిమా లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ తన కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు నడిపిస్తున్నాడు. ఇ లకపోతే తాజాగా ఈయన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో రూపొందిన ఈగల్ అనే పవర్ ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కావ్య ధాపర్ , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా నటించగా ... నవదీప్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. 

ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను ప్రస్తుతం రాబడుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ ల వివరాలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా ఇప్పటి వరకు 51.4 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ , రవితేజ కు జోడి గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే రవితేజ ... హరీష్ కాంబోలో షాక్ , మిరపకాయ్ అనే రెండు సినిమాలు రూపొందాయి. ఇందులో మిరపకాయ్ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇక ప్రస్తుతం రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా వీరి కాంబోలో మూడవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: