మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా ను సోనీ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించారు. మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజైంది. వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది.

సినిమా కథ పుల్వామా ఎటాక్ తర్వాత బాల్ కోట్ ఎయిర్ స్ట్రైక్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. సినిమాలో వరుణ్ తేజ్ రుద్ర అనే ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. ట్రైలర్ లో కావాల్సినంత ఎమోషన్, దేశభక్తి ఉందని చెప్పొచ్చు. రీసెంట్ గా హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా కూడా ఇదే రేంజ్ భారీ యాక్షన్ ఘట్టాలతో వచ్చింది.

అయితే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మాత్రం 2019 జరిగిన ఎయిర్ స్ట్రైక్ నేపథ్యం తో వస్తుండటం వల్ల సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ట్రైలర్ లో వరుణ్ తేజ్ లుక్, యాక్షన్ అదిరిపోయింది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను ఆడియన్స్ కి ఎంగేజ్ అయ్యేలా తెరకెక్కించారని అనిపిస్తుంది. ట్రైలర్ తోనే మంచి ఫీల్ వచ్చేలా చేసిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కూడా ఆశించిన రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందని చెప్పొచ్చు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది. సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుంది అన్నది చూడాలి. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఈ సినిమా తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిందీ బెల్ట్ లో కూడా మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పేట్రియాటిక్ సినిమా కాబట్టి వరుణ్ తేజ్ సినిమాకు బాలీవుడ్ లో మంచి స్కోప్ దొరికే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: