బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని సౌత్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. కెరీర్ లో మంచి ఫాం కొనసాగిస్తున్న అమ్మడు లాస్ట్ ఇయర్ బాలీవుడ్ హీరొ సిద్ధార్థ్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినిమాల విషయంలో దూకుడు తగ్గుతుందని అనుకుంటే అది ఇంకాస్త పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో అదరగొట్టేస్తున్న కియరా లేటెస్ట్ గా మరో లక్కీ ఛాన్స్ అందుకుంది.

బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ డాన్ సీరీస్ లో భాగంగా డాన్ 3 ప్లాన్ చేస్తున్నారు. రితేష్ సిధ్వాని నిర్మాణంలో వస్తున్న డాన్ 3 ని ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేయనున్నారు. డాన్ 1, 2 సినిమాల్లో నటించిన బాలీవుడ్ బాద్షా ఈ సినిమాలో నటించట్లేదు కానీ ఆయన ప్లేస్ లో బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ నటిస్తున్నారు.

రణ్ వీర్ సింగ్ కి జతగా ఈ సినిమాలో కియరా అద్వాని ఫిక్స్ అయ్యింది. ఈ కాంబో స్క్రీన్ మీద క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు. బాలీవుడ్ స్టార్స్ తో రొమాన్స్ చేస్తున్న కియరా తనకు పెళ్లైందన్న విషయాన్ని కూడా ఆడియన్స్ మర్చిపోయేలా చేస్తుంది. తప్పకుండా అమ్మడికి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. ఇక తెలుగులో చరణ్ తో గేం చేంజర్ సినిమాలో కూడా నటిస్తుంది కియరా అద్వాని. అంతకుముందు తెలుగులో భరత్ అనే నేను సినిమా చేయగా ఆ సినిమా హిట్ అవ్వడంతో రాం చరణ్ వినయ విధేయ రామా లో ఛాన్స్ అందుకుంది. చరణ్ తో మరోసారి అమ్మడు గేం చేంజర్ లో జత కడుతుంది. గేం చేంజర్ హిట్ పడితే సౌత్ నుంచి మళ్లీ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లో ప్రస్తుతం కియరా అద్వానినే సూపర్ ఫాం లో ఉంది. మిగతా హీరోయిన్స్ కి అమ్మడు సూపర్ ఫైట్ ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: