బిగ్‌బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ మూవీ బూట్‌కట్ బాలరాజు.. శ్రీ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మేఘమాల హీరోయిన్‌గా నటించింది.. అలాగే ఈ మూవీ లో సునీల్‌ మరియు ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైంది.బూట్ కట్ బాలరాజు మూవీని ఎన్నో అడ్డంకులను దాటుకొని మేకర్స్ థియేటర్లలోకి తీసుకొచ్చారు..బూట్‌కట్ బాలరాజు ప్రమోషన్స్‌, ప్రొడక్షన్ కోసం తన సొంత డబ్బులు కూడా కోసం ఉపయోగించినట్లు సోహెల్ తెలిపాడు.. థియేటర్లలో సినిమా చూడటానికి ప్రేక్షకులు రాకపోవడంతో అతడు ఎమోషనల్ అయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం..సోహెల్ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తుంది..మార్చి 1 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానున్నట్లు సమాచారం..ఈ మూవీ కథ విషయానికి వస్తే ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్రజ ) కూతురు మహాలక్ష్మిని (మేఘమాల) బాలరాజు ప్రేమిస్తాడు. వారి ప్రేమకు పటేలమ్మ ఒప్పుకోదు. సర్పంచ్ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తేనే కూతురు మహాలక్ష్మిని నీకు ఇచ్చి పెళ్లిచేస్తానని బాలరాజుతో ఛాలెంజ్ చేస్తుంది పటేలమ్మ. ఆమె ఛాలెంజ్‌ను బాలరాజు అంగీకరించాడా..సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి మహాలక్ష్మి ప్రేమను సొంతం చేసుకున్నాడా..లేదా? అన్నదే బూట్ కట్ బాలరాజు మూవీ కథ. ఈ మూవీలో బిగ్‌బాస్ బ్యూటీ సిరిహనుమంతు ఓ కీలక పాత్రలో కనిపించింది.సినిమాలో సోహెల్ కామెడీ బాగున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: