సౌత్ సినిమాల్లో హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న మాధవన్ భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ ఆడియన్స్ మనసులు దోచుకున్నాడు. ఎప్పుడో మణిరత్నం డైరెక్ట్ చేసిన సఖి సినిమాతో ఇప్పటికీ వరుసగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. మధ్యలో కొన్ని నెగటివ్ పాత్రలు ప్రయత్నించిన మాధవన్ వాటి ఫలితాలు అంత ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు.

మంచి మంచి సినిమాల్లో నటించిన మాధవన్ నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన సవ్యసాచి సినిమాలో విలన్ గా చేశాడు. ఆ సినిమా హిట్ అయితే ఎలా ఉండేదో కానీ ప్లాప్ అవడంతో మళ్లీ మాధవన్ కి విలన్ అవకాశాలు రాకుండా అయిపోయింది. సౌత్ లో  ఇక అలాంటి ఛాన్స్ రావని తెలుసుకున్న మాధవన్ బాలీవుడ్లో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమాలో మరోసారి మాధవన్ ప్రతి నాయకుడి పాత్రలో ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది.

 వికాస్ బల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా  ఈ సినిమాలో మాధవన్ విలన్ గా చేస్తున్నారని తెలుస్తుంది. సైతాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మాధవన్ నెగిటివ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. అజయ్ దేవగన్ కి జోడిగా సూర్య భార్య జ్యోతిక హీరోయిన్గా నటిస్తుంది. పెళ్లి తర్వాత చాలా ఏళ్లుగా జ్యోతిగా సిలబస్ క్రీమ్ కి దూరంగా ఉంది. మళ్లీ ఈమధ్య ఆమె వరుస సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో జ్యోతిక చేస్తున్న మొదటి సినిమాగా ఈ సైతాన్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. సైతాన్ సినిమా మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాలో అయినా మాధవన్ విలనిజం ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా మీద మాధవన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమాతో బాలీవుడ్ లో విలన్ గా తన మార్క్ చాటాలని చూస్తున్నాడు మాధవన్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: