అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కగా ఇందులో పూజ హెగ్డే  హీరోయిన్ గా నటించింది.2017లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. కానీ ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే మాత్రం హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక దువ్వాడ జగన్నాథంపాత్రలో అల్లు అర్జున్ కూడా ప్రత్యేకమైన యాసతో జనాలను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో అల్లు అర్జున్ నటించాడు.  అయితే ఈ చిత్రం షూటింగ్ దాదాపు ఏడాది కాలం పాటు సాగింది. 2016 వేసవిలో మొదలైన షూటింగ్ 2017 లో పూర్తి చేసుకుని సరిగ్గా ఏడాదికి థియేటర్ల కి వచ్చేసింది.ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే ఏడాది కాలం పాటు సినిమా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ నాన్ వెజ్ తినడం మానేశాడట. ఎందుకంటే ఈ సినిమాలో బ్రాహ్మణ వేషధారణతో ఉండే అల్లు అర్జున్ జంజ్యం వేసుకొని బ్రాహ్మణ వస్త్రాలు కూడా కట్టుకోవాల్సి వచ్చింది. అందువల్ల వాటికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు కూడా మాంసాహారాన్ని ముట్టుకోలేదట. అల్లు అర్జున్ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు ఎలాంటి సాహసాలు చేయడానికి అయినా వెనుకాడడు. కానీ ఇలా అవసరం లేకపోయినా దర్శకుడు చెప్పకపోయినా తనకు తానుగా ఈ నియమాన్ని పెట్టుకొని సినిమా షూటింగ్ పూర్తి చేశాడట, ఇక షూటింగ్ పూర్తి అయిన తర్వాతే మళ్ళీ నాన్ వెజ్ తినడం మొదలు పెట్టాడట.ఏది ఏమైనా అల్లు అర్జున్ నిజంగా గ్రేట్ కదా . ఇలా ఈ కాలంలో హెరోలు ఎవరుంటారు. ఇలా నాన్ వెజ్ మానేసి బ్రాహ్మణ పాత్ర పోషించాలని ఎవరనుకుంటున్నారు చెప్పండి. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఏదైనా ముఖ్యమైన డివోషనల్ ఫిలిమ్స్ కోసం ఇలాగే నాన్ వెజ్ తినేవారు కాదట.

మరింత సమాచారం తెలుసుకోండి: