తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య గారి కొడుకుగా అల్లు అరవింద్ కూడా ఇండస్ట్రీకి సుపరిచితమే.అయితే అల్లు వారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ కూడా ఒకరు. అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతకాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్నప్పటికీ అల్లు శిరీష్ కి మాత్రం అంతగా పాపులారిటీ దక్కలేదు .ఇక ఈయన చేసిన సినిమాలన్నీ ప్లాఫ్ అవ్వడం నటుడిగా ఈయన నటనని మెప్పించుకునే సినిమాలు ఒక్కటి కూడా రాకపోవడంతో ఈయన కనీసం మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా కూడా చోటు సంపాదించుకోవడం లేదు. అంతేకాకుండా ఈయన గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ కూడా వినిపిస్తాయి.ఆస్తి విషయంలో ఇంట్లో వాళ్లతో గొడవపడ్డారని,అలాగే తన తండ్రి అల్లు అర్జున్ ని చూసుకున్నట్లుగా తనని చూసుకోవడం లేదని వివక్ష చూపిస్తున్నారు అంటూ ఇలా ఎన్నో రూమర్స్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.కానీ ఈ రూమర్స్ చక్కర్లు కొట్టినప్పుడల్లా ఆ రూమర్స్ కి కౌంటర్ ఇచ్చేలా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫోటోలు మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ గురించి మరొక రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే అల్లు శిరీష్ సూర్య హీరోగా చేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమా చూసి అందులో హీరో ఎలా అయితే హీరోయిన్ ఇంటికి వెళ్లి ఆమెను ఇంప్రెస్ చేసి హీరోయిన్ ని ప్రేమలో పడేస్తాడో అచ్చం అలాగే అల్లు శిరీష్ కూడా ఆ సినిమా చూసి తన లవర్ ఇంటికి వెళ్లి షాకిచ్చాడట. అయితే అంతకుముందే అల్లు శిరీష్ తో లవర్ మాట్లాడడం లేదట. నెంబర్ బ్లాక్ చేయడంతో ఏం చేయాలో తెలియని అల్లు శిరీష్ ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి ఎందుకు ఫోన్ నెంబర్ బ్లాక్ చేసావ్ అని అడిగారట. ఇక అదే సమయంలో ఆ అమ్మాయి తండ్రి కూడా ఉండడంతో ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగిందట.ఇక శిరీష్ చేసిన పని వల్లే ఇదంతా జరిగిందని ఆ అమ్మాయి కోపంతో అల్లు శిరీష్ కి బ్రేకప్ చెప్పిందట. అయితే ఈ రూమర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారడంతో నిజంగానే అల్లు శిరీష్ ఆ పని చేసే ఉంటారు.. ఎందుకంటే ఇప్పటికే ఆయన నాకు రెండు మూడు సార్లు బ్రేకప్ అయిందని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు కదా అని నెటిజన్స్ భావిస్తున్నారు.ఇక అల్లు శిరీష్ గత సంవత్సరం ఒక్క సినిమా కూడా చేయలేదు. 2022లో ఊర్వషివో రాక్షసివో అనే సినిమా చేసినప్పటికీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించ లేకపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: