బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా సినిమాలతో పాటు అక్కడ స్పెషల్ సాంగ్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. టాలీవుడ్ లో కూడా ఒకటి రెండు స్పెషల్ సాంగ్స్ అదే ఐటం సాంగ్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో గ్లామర్ ట్రీట్ అందించింది అమ్మడు. రాం స్కంద సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. బాస్ పార్టీ సాంగ్ సూపర్ హిట్ కాగా రాం సాంగ్ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.

ఈ అమ్మడు తెలుగులో మరో ఆఫర్ అందుకుందని అంటున్నారు. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ కి ఫిక్స్ అయ్యిందట. ఈ సినిమాలో అమ్మడిని కేవలం సాంగ్ కోసమే కాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రలో కూడా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆడియన్స్ లో ఊర్వశికి ఉన్న క్రేజ్ ని వాడేసుకుందామని బాబీ పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడు.

అందాల భామ ఊర్వశి రౌతెల చేస్తున్న ఈ స్పెషల్ అప్పియరెన్స్ సినిమాకు క్రేజ్ వచ్చేలా. బీ టౌన్ లో ఇప్పటికే టాప్ లేపే అందాలతో అదిరిపోయే ట్రీట్ అందిస్తున్న ఊర్వశి ఇప్పుడు సౌత్ సినిమాల్లో ముఖ్యంగా టాలీవుడ్ లో కూడా అలా అదరగొట్టాలని చూస్తుంది. బాలయ్య సినిమాతో కూడా తన గ్లామర్ తో ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది అమ్మడు. బాలయ్య 108లో కేవలం సాంగ్ తోనే కాదు స్పెషల్ రోల్ తో కూడా ఊర్వశి మెప్పిస్తుందని అంటున్నారు. తెలుగులో కూడా ఎలాగైనా పాపులర్ అవ్వాలని చూస్తున్న ఊర్వశి రౌతెల గ్లామర్ ట్రీట్ తో పాటుగా యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ కూడా చేయాలని అనుకుంటుంది. ఊర్వశి చేస్తున్న ఈ రోల్ పై ఆడియన్స్ లో ఒకరమైన క్యూరియాసిటీ ఏర్పడింది. తప్పకుండా ఈ సారి ఊర్వశి తన పర్ఫార్మెన్స్ తో కూడా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: