నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయనా ఆ తర్వాత నాగార్జున నాగ చైతన్యతో చేసిన బంగార్రాజు సినిమాలతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా చేయాలని చర్చలు జరిగాయి. మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లో భారీగా ఈ సినిమా ప్లాన్ చేశారు. సడెన్ గా ఏమైందో ఏమో కానీ ప్లాన్ మార్చేసి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారు. దాని ప్లేస్ లోనే వశిష్టతో విశ్వంభర ఓకే చేశాడు మెగాస్టార్ చిరంజీవి. కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్టే అని సమాచారం.

చిరు సినిమా మిస్ అవ్వడంతో మళ్లీ ఇప్పుడు ఆ డైరెక్టర్ మళ్లీ నాగార్జున దగ్గరకు వచ్చాడని తెలుస్తుంది. నాగార్జున తో రెండు సూపర్ హిట్లు కొట్టాడు డైరెక్ట్ర్ కళ్యాణ్ కృష్ణ. చిరు సినిమా క్యాన్సిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటో తెలియదు కానీ కళ్యాణ్ కృష్ణ మాత్రం నాగార్జునతో సినిమా చేయాలని అనుకుంటున్నారు.

నాగార్జున కూడా కళ్యాణ్ కృష్ణ మీద మంచి నమ్మకంతో ఉన్నాడని తెలుస్తుంది. అక్కినేని హీరోలకు 3 హిట్లు ఇచ్చినా ఈ డైరెక్టర్ టైం కలిసి రావట్లేదని చెప్పొచ్చు. అయితే నాగార్జున మంచి కథతో వస్తే తను ఆఫర్ ఇస్తానని హామీ ఇచ్చారట. చిరు కోసం రెడీ చేసిన కథతో నాగార్జునతో సినిమా చేస్తారా ఏంటి అని చర్చలు జరుగుతున్నాయి. నా సామిరంగ హిట్ తర్వాత నాగార్జున సినిమాల జోరు పెంచారు. తప్పకుండా ఈ కాంబో సినిమా వస్తుంది. కాకపోతే అది ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. కళ్యాణ్ కృష్ణ మాత్రం ఈసారి ఛాన్స్ వస్తే బ్లాక్ బస్టర్ ని టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. మరి ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు. నాగార్జునతో సోగ్గాడి సీక్వెల్ సినిమా ఉంటుందా.. కళ్యాణ్ కృష్ణ అప్డేట్స్ కోసం తెలుగు ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: