మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎవరికివారు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇలా మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా మెగా ప్రిన్స్ గా మారిపోయాడు వరుణ్ తేజ్. ఇక తనదైన సినిమాలతో ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు అనే విషయం తెలిసిందే. హిట్టు ఫ్లాపాలతో సంబంధం లేకుండా తన సినిమాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు ఈ మెగా హీరో.


 ఇక ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తుంది. మరోసారి పవర్ఫుల్ యాక్షన్ తో వరుణ్ తేజ్ తన అభిమానులు అందరినీ కూడా మెస్మరైస్ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవలే వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి రహస్యంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం నడిపిన ఈ మెగా హీరో.. ఇక ఇటీవల తన ప్రియ సఖిని పెళ్లి చేసుకున్నాడు.  గత ఏడాది నవంబర్లో ఇద్దరి వివాహం ఇటలీలో ఎంతో ఘనంగా జరిగింది అని చెప్పాలి.


 అయితే మన దేశంలో ఎన్నో మంచి ప్లేసెస్ ఉండగా ఇటలీలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్నది మాత్రం ఇప్పటికే ఎవరికీ తెలియదు. అయితే ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి వెనుక అసలు కారణం ఏంటి అన్నది చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. నా కుటుంబం చాలా పెద్దది. ఇక్కడ వివాహం జరిగితే వేడుకను వాళ్లు పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకే ఇటలీలో వివాహం చేసుకోవాలని నిర్ణయించాం. కేవలం 100 మందిని మాత్రమే ఇక పెళ్లి వేడుకకు ఆహ్వానించాం. ఇక నా కుటుంబ సభ్యులందరూ కూడా వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపారు అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. అయితే వరుణ్, లావణ్య మొదటిసారి ఇటలీలో కలిసిన కారణంగానే వారి పెళ్లిని కూడా అక్కడే జరుపుకోవాలని అనుకున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: