టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ నటి మనలలో ప్రియమణి ఒకరు. ఈ ముద్దు గుమ్మ జగపతి బాబు హీరోగా రూపొందిన పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది. ఇకపోతే ప్రియమణి కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. ఇకపోతే హిందీ లో కూడా ఈమె పలు సినిమాలలో నటించింది.

తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరో గా నయన తార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందినటువంటి జవాన్ మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం అలాగే ఇందులో ఈ బ్యూటీ పాత్ర కూడా బాగుండడంతో ఈమెకు ఈ సినిమా ద్వారా హిందీ నాట మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా బాలీవుడ్ నటి మనులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ప్రియమణి మాట్లాడుతూ ... బాలీవుడ్ నటి మనులు ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్నప్పుడు... అలాగే లోపలికి వెళుతున్నప్పుడు మరియు జిమ్ సెంటర్ ల నుండి బయటకు వస్తున్నప్పుడు ... లోపలికి వెళ్తున్నప్పుడు అలాగే కొన్ని ప్రదేశాలలో వారిని ఫోటో గ్రాఫర్ లు ఫోటోలు తీస్తూ ఉండే విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ ఫోటోలు అన్నీ వారు ఇష్టం కొద్ది తీయరు అని వారికి డబ్బులు ఇచ్చి నటి మనులే తీయించుకుంటారు అని ప్రియమణి ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇక తాజాగా ప్రేమను చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: