ఇప్పటికే అనేక తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే తన ఇంట్రెస్ట్ ను తమిళ , హిందీ సినిమాలపై పెట్టింది.

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఆఖరుగా కొండపొలం అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు రకుల్ ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ టాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం ఈమె వరస పెట్టి తమిళ , హిందీ సినిమా లలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తన తొలి సంపాదన గురించి వివరించింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ... మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే వ్యక్తులు మన చుట్టూ లేనప్పుడు మనం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను సినిమా ఇండస్ట్రీ కి రాకముందు మాడలింగ్ చేసేదాన్ని. అలా మోడలింగ్ చేసే సమయంలో నా తొలి సంపాదన 5000. అలా 5000 స్థాయి నుండి నేను ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం మా తల్లిదండ్రులు మరియు స్నేహితుల ప్రోత్సాహమే. వాళ్ళు లేకుంటే నాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యవేవి అని రకుల్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: