ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమా లలో తెలుగు భాషలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 12 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" సినిమా తెలుగు వర్షన్ ప్రపంచ వ్యాప్తంగా 371.41 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత బాహుబలి 2 సినిమా 360 కోట్ల కలక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలవగా ... సలార్ మూవీ 217.13 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. బాహుబలి పార్ట్ 1 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 194 కోట్ల కనెక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలవగా ... అలా వైకుంఠపురంలో సినిమా 159.2 కోట్లు కలెక్షన్ లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. 

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 135.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 6 వ స్థానంలో నిలవగా ... చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 128 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 7 వ స్థానంలో నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం సినిమా 127.52 కోట్ల కనెక్షన్ లను వసూలు చేసి 8 వ స్థానంలో నిలవగా ... తేజ సజ్జ హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ మూవీ 122 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 10 వ స్థానంలో నిలిచింది. సహో మూవీ 112.73 కోట్ల కలెక్షన్ లను వాసులు చేసి 11 వ స్థానంలో నిలవగా ... మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమా 111.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 12 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: