ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమా లలో తెలుగు భాషలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" సినిమా తెలుగు వర్షన్ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత బాహుబలి 2 సినిమా 560 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలవగా ... సలార్ మూవీ 368.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. బాహుబలి పార్ట్ 1 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 332 కోట్ల గ్రాస్ కనెక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలవగా ... అలా వైకుంఠపురంలో సినిమా 256.36 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 231. కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి 6 వ స్థానంలో నిలవగా ... మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా 223.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసి ఏడవ స్థానంలో నిలిచింది. చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 201 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 8 వ స్థానంలో నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం సినిమా 216.7 కోట్ల గ్రాస్ కనెక్షన్ లను వసూలు చేసి 9 వ స్థానంలో నిలవగా ... తేజ సజ్జ హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ మూవీ 213 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: