తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించాడు. అందులో భాగంగా ఈయన కేవలం తెలుగు సినిమా లలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించాడు. ఎక్కువ శాతం తెలుగు తర్వాత ఈయన తమిళ సినిమాలలో నటించాడు. అందులో భాగంగా తాజాగా కూడా సందీప్ తమిళ నటుడు ధనుష్ హీరో గా రూపొందిన కెప్టెన్ మిల్లర్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఊరు పేరు భైరవకోన సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కావ్య దాప , వర్షా బొల్లమ్మ హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఈ ఫిబ్రవరి 16 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోష్ లో కలెక్షన్ లను రాబడుతుంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా దాదాపు సక్సెస్ కి దగ్గరగా రావడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన సీక్వెల్ పనులను ప్రారంభించినట్లు మరి కొన్ని రోజులే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk