ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితమే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఆలియా బట్ , రామ్ చరణ్ కి జోడి గా నటించింది. ఈ మూవీ కి ఏకంగా ఆస్కార్ అవార్డ్ రావడంతో ఈ బ్యూటీ కి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ద్వారా గుర్తింపు లభించింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా అలియా భట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో ఆలియా అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఉంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆలియా ఒక పండంటి బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: